Home Blog Page 2

హీరో ధనుష్‌ నుంచి ‘కుబేర’ వినాయ‌క చ‌వితి స్పెషల్ పోస్టర్.. !

0

త‌మిళ హీరో ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రష్మిక మందన్న కథానాయికగా న‌టిస్తుంది. ఈమూవీలో నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. నేడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా చిత్రయూనిట్ గణేష్ చతుర్థి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు ధ‌నుష్ ఉండ‌గా.. నాగార్జున ఉన్నాడు.

దువ్వాడ కుటుంబ కథ.. ఇంట్లో మాధురి.. వీధిలో వాణి

0

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి ప్రవేశించింది. దీంతో తన కూతుళ్లు, బంధువులతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శ్రీనివాస్ భార్య వాణి సిద్ధమైంది. దీంతో పోలీసులకు, వాణి బంధువులకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది.

ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. ఓ వ్యక్తి దారుణ హత్య

0

ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో జరిగింది. ఏలూరులోని ముదినేపల్లి మండలం వూరుకూరు గ్రామంలో బాలకోటయ్యను కత్తులతో నరికి చంపారు ప్రత్యర్ధులు. మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను గ్రామంలో పెట్టిన సందర్భంలో కొంద‌రితో బాల‌కోట‌య్యకు వివాదం జ‌రిగింది. ఆ కక్షల కారణంగా బాలకోటయ్యను హత్య చేసినట్టు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కారణంగానే హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్ మాములుగా లేదుగా..! (Video Viral)

0

మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ జిల్లాలోని గంగాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మహిస్మాల్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ పాటకు ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆ స్టెప్పులను పలువురు మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం విమర్శించారు.

ఓటీటీలోకి “మిస్టర్ బచ్చన్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

0

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేసింది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుందని ప్రకటించారు.

66 కేజీల గోల్డ్..325 కిలోల వెండితో గణపయ్య.. దేశంలోనే సంపన్న వినాయకుడి ప్రతిమ ఇదే..!

0

ఈ ఏడాది వినాయకచవితికి ముంబైలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ ‘మహాగణపతి’ వార్తల్లో నిలిచారు. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఈ గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందింది. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్తగా ఈ గణేశుడి వేడుకలకు రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

చెరువులు నింపటానికి నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

0

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని చింతలచెరువు, కొండచెరువు నింపుటకు ఎగువ మానేరు కుడికాలువ ద్వారా మల్లారెడ్డిపేటలో చెరువు నుండి ఇరిగేషన్ పై అధికారుల ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండలంలోని పలు చెరువులను నింపటానికి ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ రాజు సిబ్బందితో కలిసి నీటిని విడుదల చేశారు చెరువులను నింపడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రూల్స్ పాటించకుండా డీజే పెడితే.. సీజ్ చేస్తాం..!

0
  • ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండొద్దు..
  • ప్రజా శాంతికి భంగం కలిగించేల శబ్దం పెట్టొద్దు..
  • ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించినచో కఠిన చర్యలు తప్పవు
  • కోదాడ పట్టణ సిఐ రామ వెల్లడి

ఇదే నిజం, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివాహాలు ఇతర ఏ రకమైన వేడుకల్లోనైనా, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే విధంగా, ప్రజాశాంతి భంగం కలిగించే విధంగా డీజేలను శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని కోదాడ పట్టణ సిఐ రాము తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ఉన్న పోలీస్ స్టేషన్ లో డీజే ఓనర్లను ఆపరేటర్లను పిలిపించి మాట్లాడారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించిన యడల డీజే ఆపరేటర్ పై వేడుక నిర్వహించే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని డీజే లను సీజ్ చేయబడునని తెలిపారు. డీజే ఓనర్స్ ఆపరేటర్ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే.. ఈ 6 అలవాట్లను వెంటనే మానేయండి..!

0

వయస్సు మీద పడినా శరీరం యవ్వనంగా కనిపించేలా ఉంచుకోవడం కోసం ఈ 6 అలవాట్లకు దూరంగా ఉండాలని అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సౌరభ్ సేథి తెలిపారు. సిగరెట్ తాగడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, సూర్యుడి అతినీలలోహిత కిరణాలు (UV) తగిలేలా ఎండలో ఎక్కువ సేపు ఉండటం, తరచూ డీహైడ్రేషన్‌కు గురికావడం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురికావడం ద్వారా త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు.

BREAKING: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్..!

0

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి విజిలెన్స్‌ డీజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో.. సీవీ ఆనంద్‌ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది.